అగ్రహం వ్యక్తం చేస్తున్న హనుమాన్ దీక్ష స్వాములు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 16 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నేపల్లిలో ఉన్న మదర్ థెరీస్సా పాఠశాలలో హనుమాన్ భక్తులకు అవమానం జరిగింది. మంగళవారం హనుమాన్ మాలా ధారణ ధరించిన బాలస్వామి వస్త్రాలను తొలగించి స్కూల్ మదర్ థెరిస్సా యాజమాన్యం చేశారు.మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కన్నెపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల మదర్ థెరిస్సా పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి హనుమాన్ దీక్ష మాల ధరించి ఆ దీక్ష బట్టలతో పాఠశాలలో ఎగ్జామ్ రాసినందుకు వచ్చాడు. పాఠశాలకు వచ్చిన విద్యార్థుల్ని బయట నిలబెట్టి హనుమాన్ దీక్ష బట్టలు విప్పి స్కూల్ యూనిఫామ్ వేసుకుని వస్తేనే ఎగ్జామ్ రాయడానికి ఇస్తామని విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించిన పాఠశాల యాజమాన్యం,ఈ విషయం హనుమాన్ దీక్ష స్వాములకు సమాచారం తెలిపి వారితో పాఠశాలకు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న హనుమాన్ దీక్ష స్వాములు ఎందుకు మాల ధరించిన దుస్తులు తీసివేయాలని అడగగా ప్రిన్సిపాల్ దురుసుగా మాట్లాడారు.అలా మాట్లాడడంతో హనుమాన్ దీక్ష స్వాములు పాఠశాల ప్రిన్సిపల్ పై కోపంతో రగిలిపోయి పాఠశాలలో ఉన్న చాంబర్ అద్దాలను పగలగొట్టి జాతీయ రహదారిపై బైఠాయించారు.స్థానిక లక్షెట్టిపేట సి ఐ రావడం జరిగింది.ప్రిన్సిపాల్ క్షమాపణ చెప్పాలంటూ నిదానతో హనుమాన్ దీక్ష స్వాములు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్ సంఘటన చేరుకొని స్వాములను శాంతింపచేసి వారిని ఎం ఈ ఓ తో పరిష్కారం పై సంబంధిత అధికారులతో మాట్లాడి వీరికి తగిన న్యాయం చేస్తాము చెప్పడం జరిగింది.దీక్ష స్వాములు మాట్లాడుతూ… హనుమాన్ మాల వేసుకున్న కారణంతో విద్యార్థిని స్కూల్ యజమాన్యం పరీక్ష రాసేందుకు అనుమతించలేదు,మదర్ థెరిస్సా స్కూల్ లో చదువుతున్నాడు అయితే. విద్యార్థి ఇటీవలే ఆంజనేయ స్వామి మాల వేసుకుని పరీక్ష రాసేందుకు స్కూలుకు వెళ్లగా ప్రిన్సిపాల్ మాల తీస్తేనే పరీక్ష రాయాలి విద్యార్థికి చెప్పగా విషయం కాస్త బయటకు తెలియడంతో హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు రావడం జరిగిందని తెలిపారు.యజమాన్యం తీరుకు వ్యతిరేకంగా ఆంజనేయ మాలా స్వాములు ఆందోళన చేపట్టారు.రాస్తారోకో ను విరమించి న్యాయం జరగకపోతే మళ్లీ వస్తామని యజమానానికి హెచ్చరించారు. అంతేకాకుండా ఇలా చేయడం భారతదేశంలో ఎక్కడ లేదని ఇదే మొదటి సారి అని తెలియపరిచారు. పాఠశాల యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ మండలాల హనుమాన్ దీక్ష స్వాములు.వివిధ గ్రామాల తల్లిదండ్రులు పాల్గొన్నారు.