ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 15 : ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు అన్నారు.బుధవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రి కి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…లక్షెట్టిపేట 8.50 కోట్లతో రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తున్నమన్నారు.మంచిర్యాల జిల్లాతో పాటు మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కిందన్నారు. అంతేకాకుండా గూడెం లిఫ్ట్ మరమ్మత్తులు జరుగుతున్న దృష్ట్యా నూతన పైపులు వేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ….తెలంగాణ అభివృద్ధి లో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.అనంతరం స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ…అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ను ప్రజల ఆశీర్వాదాలు ఉండాలని కోరారు.మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు రైతులకు చేసిందేమిటని ఏద్దేవా చేశారు. అంతకుముందు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.సుమారు 5 వేల మంది ప్రజలు సమావేశానికి హాజరైనారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంతోష్ నాయక్, ఎమ్మెల్యే లు బాల్క సుమన్,దుర్గం చిన్నయ్య, డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు,మోటపలుకుల గురువయ్య,నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ బాబు,మున్సిపల్ చైర్మన్ కాంతయ్య,వైస్ చైర్మన్ పోడేటీ శ్రీనివాస్ గౌడ్,ఎంపీపీలు మంగ,గడ్డం శ్రీనివాస్,మున్సిపల్ చైర్మన్లు ప్రభాకర్,శ్వేత,కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.