ప్రకృతి విపత్తు బాధితులను ఆదుకోండి ఖమ్మంలో విరాళాల సేకరణ

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 03 (ప్రజాబలం) ఖమ్మం ప్రకృతి విపత్తు బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని సిపిఐ ఖమ్మంజిల్లా సమితి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కేరళ రాష్ట్రంలోని వాయినాడ్లో ప్రకృతి విపత్తు కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులైన విషయం విధితమే. బాధితులను ఆదుకునేందుకు శనివారం సిపిఐ ఆధ్వర్యంలో నగరంలో విరాళాలను సేకరించారు. రెండు, మూడు బృందాలుగా ఏర్పడి విరాళాలను సేకరించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ లు మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో మునుపెన్నడు కనీవిని ఎరుగని రీతిలో ప్రకృతి విపత్తు సంభవించిందని వందలాది మంది సజీవ సమాధి అయ్యారన్నారు. ఈ విపత్తుకు యావత్ దేశం స్పందించిందని ఎవరికి తోచిన రీతిలో వారు సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లా నుంచి కూడా వాయినాడ్ బాధితులకు ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిందని దాతలు ముందుకు వచ్చి బాధితులకు ఆర్థిక సాయం అందించాలని హేమంతరావు, ప్రసాద్ లు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు యర్రాబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, మహ్మద్ సలాం, సిహెచ్ సీతామహాలక్ష్మి, మేకల శ్రీనివాసరావు, పగడాల మల్లేష్, రావి శివరామకృష్ణ, జిల్లా సమితి సభ్యులు యానాలి సాంబశివరెడ్డి, ఏనుగు గాంధీ, నూనెశశిధర్, ప్రతానపు రామనాథం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking