ఆసుపత్రి ద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలి:: జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.

 

 

డాక్టర్లు సమయపాలన పాటించి, అందుబాటులో ఉండాలి.

అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు.

ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా ఆగష్టు 16 : ఆసుపత్రి ద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని
జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. అన్నారు

గురువారం జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి లో ఆసుపత్రి సూపర్ ఇండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, డాక్టర్లు, వైద్య సిబ్బందితో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రస్తుతం వైరల్ జ్వరాలతో ఆసుపత్రిలో ఎంత మంది వ్యాధి గ్రస్థుల వివరాలను ఆరా తీశారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వివిధ రకాల వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.డయాగ్నస్టిక్ హబ్ ద్వారా రోగులకు నిర్వహిస్తున్న వివిధ రకాల వైద్య పరీక్షల అంశాన్ని ఆరా తీశారు. డాక్టర్లు విధులలో అందుబాటులో ఉండాలని రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
డెంగ్యూ, మలేరియా లాంటి ప్రమాదకర జ్వరాల బారిన పడిన రోగులను నిరంతర పర్యవేక్షిస్తూ ప్రత్యేక వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉంటూ కావలసిన మందులను, విష సర్పాల కాటుకు, కుక్క కాటుకు కావలసిన వాక్సిన్లు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులను ఆదేశించారు.

గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. 100% ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్ జరగాలని, సకాలంలో టీకాలు అందజేయాలని అన్నారు. గర్భిణీ స్త్రీలను ఫాలో అప్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా చూడాలని ఆన్నారు.
డయాగ్నస్టిక్ హబ్ ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, రోగులకు చేస్తున్న ప్రతి పరీక్ష వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఆయన తెలిపారు. ఓ పి సేవల్లో రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్యాజువాలిటి, ప్రసూతి వార్డు, లేబర్ రూమ్, ప్లేట్ లెట్ మిషన్, ఐసీయు, జనరల్ వార్డు లలో ఉన్న సౌకర్యం లు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ మోహన్ లాల్ , డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking