జగిత్యాల ప్రతినిధి మే 29 (ప్రజాబలం) జగిత్యాల యావత్ రైతాంగం అకాల వర్షాలతో నష్టపోయి మరోవైపు వరిధాన్యం కొనుగోలుకేంద్రాల్లో దోపిడీమరియు తీవ్రఇబ్బందుల్లో ఉంటే దశాబ్ది సంబరాలు ఎలా జరుపుకోవడం తగును అని రైతు రాష్ట్ర నాయకులు పరాజితులు జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల అన్నారు.
సోమవారం ఆయన జిల్లాలో పలు చోట్ల రైతుల సమస్యలను తెలుసుకొని అనంతరం మాట్లాడుతూ యావత్ ప్రజానీకానికి అన్నం పెట్టే రైతు అనేకానేక ఇబ్బందులు ఈ పాలకుల వైపల్యం అధికారుల నిర్లక్ష్యం మూలంగా పడుతున్నారని ప్రధానంగా అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను అదుకోకపోగా ఖరీఫ్ సమీపిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు నత్తనడకా సాగుతున్నాయని అందులో మళ్ళీ తప్ప తాలు తరుగు పేరిట అడ్డగోలుగా దోచుకుంటున్నారని అంతేగాక ఇప్పటికి ఖరీఫ్ కు ప్రభుత్వం సన్నద్ధం కాలేదని విత్తనాలు ఎరువులు సాగు విస్తీర్ణం ప్రణాళికలు అంచనాలు అవగాహన సమీక్షలు ఏవి లేవని ఇంతగా సాగు రంగాన్ని గాలికి వదిలేసి సంబరాల పేరిట సమయత్తమ్ కావటం సిగ్గు చేటని సంబరాల మీద ఉన్న శ్రేద్ద సాగును సంబరం చేస్తే రైతులు రైతుకూలీలు యావత్ ప్రజానీకం సంబరాలు చేసుకొంటారని అవి కావాలి గాని కోట్లు కుమ్మరిస్తూ చేసేవి గీవి అసలు సంబరాలు కావని ఇప్పటికయినా రైతుల సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రత్యేక దృష్టి సలపాలని అన్నారు పలువురు రాజేష్,మల్లారెడ్డి,సతీష్,గణేష్ తదితర రైతు నాయకులు,రైతులు పాల్గొన్నారు.