అదృష్టం వరిస్తే లక్ష రూపాయలకే కోటి రూపాయల ఇల్లు మీ సొంతం

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 1 (ప్రజాబలం) ఖమ్మం ఓ సామాన్యుడు కోటి రూపాయల ఇల్లు కొనుగోలు చేయడం అనేది దాదాపు అసాధ్యం.అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు ఖమ్మం లో ఉన్న శ్రీ జయ విలాసిని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు.కేవలం లక్ష కే ఆ అదృష్టం వరించనుంది లాటరీ పద్ధతిలో లక్ష కట్టిన వారికి కోటి రూపాయల ఇల్లు సొంతం కాబోతుంది. ఇంతటి సువర్ణ అవకాశాన్ని అందించబోతోంది

శ్రీ జయ విలాసిని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్

లక్ష కట్టు – కోటి రూపాయల ఇల్లు పట్టు

ప్రస్తుతం ఖమ్మంలో వినిపిస్తున్న హాట్ టాపిక్ ఇదే

రియల్ ఎస్టేట్ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది శ్రీ జయ విలాసిని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్.డాక్టర్ కుంచపు రాంబాబు గారి ఆలోచనలో నుంచి జాలువారిన ఈ నినాదంతో ఎంతోమంది సామాన్యులకు కోటీ రూపాయల G+1 ఇల్లు సొంతం కానుంది.అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తాను ప్రతి సామాన్యుడు తన కలల భవనము ను సొంతం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశాడు.దానికి కేవలం లక్ష రూపాయలతో కూపన్ కొనడం మాత్రమే.ఇంటి నిర్మాణం జరిగిన ప్రాంతంలో ఉన్న రేటును బట్టి కోటి రూపాయల ఇంటికి లక్ష రూపాయలతో కూపన్ కొని 100 కూపన్ లు కాగానే లైవ్ లో ప్రజలు,ప్రముఖుల సమక్షంలో లాటరీ పద్ధతుల్లో గెలిచిన వారికి సన్మానం చేసి మరీ ఆ కలల ఇంటిని బహూకరిస్తామని తెలిపారు.వినియోగదారుల విజ్ఞప్తుల మేరకు 70 లక్షల పైన కూడా ఇల్లు నిర్మించి,ఇదే పద్ధతిలో బహుకరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.ఖమ్మం నగరానికి అతి చేరువలో ఉన్న రఘునాధపాలెం మండలం పోలీస్ స్టేషన్ ఎదురుగా సకల సౌకర్యాలతో ఈ వెంచర్ ఉంటుందని,ఈ సదా అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికే ఈ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఈ స్కీమ్ లో రాయితీ కూడా ఉంటుందని తెలిపారు నేటి మీ తెలివైన నిర్ణయమే రేపటి మీ పిల్లల బంగారు భవిష్యత్తు అని అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking