యూత్ నాయకుడు దర్శనాల నవీన్ డిమాండ్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 24 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని టీ టైమ్ పక్క నుండి వెళ్లే దారిలోని డ్రైనేజీపై గతంలో నిర్మించిన స్లాబ్ కూలీ పోయిందని,దానిని వెంటనే బాగు చేయాలని యూత్ అధ్యక్షుడు దర్శనాల నవీన్ డిమాండ్ చేశారు.బుధవారం అయన కూలిపోయిన రోడ్డును సందర్శించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వెంటనే మరమ్మత్తులు చేసి శాశ్వత పరిష్కారం చేయాలని అయన మున్సిపల్ అధికారులను కోరారు.