ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 14 (ప్రజాబలం) ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ముందుగా హరీష్ రావు హెలికాఫ్టర్ లో ఖమ్మంకు రాగా ఆయనకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ వద్ద నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజీ భవనం వద్దకు రాగానే మెడికల్ విద్యార్థులు హరీష్ రావుకు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మెడికల్ అడ్మినిస్ట్రేషన్ భవనంతో సహా మెడికల్ కాలేజీ తరగతుల భవనాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మధు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.