స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకల ఘనంగా నిర్వహించాలి

 

జిల్లా కలెక్టరు గౌత‌మ్

ప్రజబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 9:
స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకల ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు గౌత‌మ్ పొట్రు అధికారులను ఆదేశించారు.
ఈ నెల 15న క‌లెక్ట‌రేట్ ఆవ‌ర‌ణ‌లో నిర్వహించబోయే భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం నాడు అదనపు కల్లెక్టరు లోకల్ బాడీస్ రాధిక గుప్తా, అదనపు కల్లెక్టరు రెవిన్యూ విజయేందర్ రెడ్డి, జిల్లా అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.

పోలీస్ గౌరవ వందన స్వీకరణ, బందోబస్తు ఏర్పాట్లను నిర్వహించాలని, స్టేజ్, సీటింగ్, పి.ఎ. సిస్టమ్, త్రాగునీరు,పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, గౌరవ ముఖ్య అతిథి ప్రసంగం రూపొందించాలని, పాఠశాలల విద్యార్ధినీ విద్యార్ధులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, గ్రౌండ్ లో మెడికల్ టీమ్ తో ఎమర్జెన్సీ సేవలు, నిరంతరాయ విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉత్తమ సేవలందించే ఉద్యోగులను గుర్తించి ఉత్తమ సేవా ప్రశంసా పత్రాల కోసం ప్రతిపాదనలు పంపాలని కోరినారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా అత్యంత ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియచేసే స్టాల్స్ ఏర్పాటు చేయాలని సంబందిత శాఖ అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించాలని తెల్పినారు.
జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు నిర్వహించే ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ప్రోటోకాల్ నిబంధనలను జిల్లా అధికారులు ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి హరిప్రియ సంబందిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking