జెండా ఆవిష్కరించిన జావేద్
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 15 (ప్రజాబలం) ఖమ్మం నగరం లో పలు డివిజన్ లలో నగర కాంగ్రెస్ ఆద్వర్యంలో మంగళ వారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువాళ్ళ దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ జావేద్ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాజ్యాంగం మనకు మార్గదర్శక పత్రం. రాజ్యాంగ పీఠికలో మన స్వాతంత్ర సమరానికి ప్రాతిపదికలైన ఆదర్శాలను పొందుపరిచారు. మన జాతి నిర్మాణానికి కృషిచేసిన వారి కలలు సాకారం చేసేందుకు మనం సామరస్యంతో, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుదాం అన్నారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం కాంగ్రెస్ పార్టీ చేసిన కృషితో నేడు 77 ఏండ్ల స్వాతంత్రంలో బతుకుతున్నామని అన్నారు. ప్రపంచ చరిత్రలో యుద్ధం లేకండా విముక్తి లేదు రక్తపాతం లేకుండా స్వాతంత్ర్యం లేదు. కానీ అహింస అనే ఆయుధంతో రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన భారతదేశం ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. ఎన్నో పోరాటాలు ఎందరో త్యాగాలు ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు అని గుర్తు చేశారు . ప్రతి ఒక్కరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో 2 వ డివిజన్ కార్పొరేటర్ మలిదు వెంకటేశ్వర్లు,8 వ డివిజన్ కార్పొరేటర్ లాకావాత్ సైదులు,5 వ డివిజన్ కార్పొరేటర్ పల్లెబోయిన భారతీ చంద్రం, 57వ డివిజన్ కార్పొరేటర్ రఫిధా బేగం ముస్తఫా,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, దివ్య, పుష్ప, పసుపులేటి దేవేందర్, బిహెచ్ రబ్బానీ, కరుణాకర్ రెడ్డి, నల్లమల సత్యంబాబు, శంకర్ నాయక్, పాలకుర్తి నాగేశ్వరరావు, అబ్బాస్, గౌస్, బోజెడ్ల సత్యనారాయణ, షేక్ రజీ, వెచ్చ చలపతి, కందుల శ్రీను, నరసింహారావు,పాపయ్య,అన్నేపాక భాస్కర్, గోపీ,ముజాహిద్,మేహమోధ్,వసీం, మేహరజ్, రియాజ్ తది తరులు పాల్గొన్నారు.