హైదరాక్బాద్ ఫిబ్రవరి 15 ();ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హిమాయత్ నగర్ లోని లిబర్టీ ప్లాజాలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ (ఐపిసి )నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివలెంక నాగ ఉదయలక్ష్మి హాజరై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె ఐపిసి ప్రధాన అంశాలైన పంచ సూత్రాల గురించి వివరించారు.వీటిని కార్య కర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ముఖ్య ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి,. పార్టీ జాతీయ కార్యదర్శి నజీర్ పాషా ,నేషనల్ సెక్రటరీ వేల్పూరి శ్రీనివాస్, విటోబా, జాతీయ కార్యదర్శి మోహన్ గాంధీ, మహాలక్ష్మి, అరుణ ,క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జి నవీన్ శ్రీనివాస్, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మునుగోడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు