ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతవాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవిబాబు
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 23 (ప్రజాబలం) ఖమ్మం
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని
జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి రవిబాబు చీఫ్ సూపెరింటెండెంట్లు డిపార్ట్మెంటల్ అధికారులకు సూచించారు. ఈ నెల 28 నుండి మార్చి 19 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాన్నం 12 గంటల వరకు కొనసాగనున్న ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ పరీక్షల నిర్వహణపై శుక్రవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలోఅధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధులు కేటాయించిన అధికారులు వెంటనే ఆయా పరీక్షా కంద్రాలను సందర్శించి ఫర్నీచర్, విద్యుత్, మంచినీరు, వెలుతురు వంటి మౌలిక సదుపాయాలును పరిశీలించి ఏమైనా లోటుపాట్లు ఉంటె తెలిపితే తగు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవడంతో పాటు పరీక్షా కేంద్రాలవద్ద ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జిల్లాలో ప్రధమ,ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 36578 మంది పరీక్షలు వ్రాయనున్నారని, ఇందుకోసం 70 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సి.సి.కేమేరా నిఘాలో పరీక్షలు కొనసాగుతాయని, ఎటువంటి మాల్ ప్రాక్టీస్, దుర్వినియోగా లకు అవకాశం ఇవ్వకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలన్నారు. అధికారులకు ఇచ్చిన బుక్ లెట్ లోని మార్గదర్శకాలను ఖచితంగా పాటిస్తూ విద్యార్థులకు నిర్దారిత సమయంలో ప్రశ్ననా పత్రాలు, జవాబు పత్రాలు అందించాలని వాటిపై విద్యార్థులు హాల్ టికెట్ సరిగ్గా వేసేలా ఇన్విజిలేటర్ సంతకం చేసేలా చూడాలన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా చూడాలని, ఉదయం 9.00 గంటల తరువాత పరీక్షా కేంద్రానికి అనుమతించారాదని స్పష్టం చేశారు. స్మార్ట్ ఫోన్లు, మొబైల్స్, స్మార్ట్ వాచీలు తదితర ఎలక్ట్రానిక్ గాడ్జెస్ పరీక్షా కేంద్రాలలో అనుమతించబడవని అన్నారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాయ న్నారు జవాబుపత్రాలను క్లోస్డ్ కంటైనెర్ లో తరలించేలా చూడాలని తపాలా శాఖకు సూచించారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలనీ రెవెన్యూ, పోలీస్ అధికారులను సూచించారు ఈ సమావేశంలో హైపవర్ కమిటీ డాక్టర్ కి. శ్రీనివాసరావు, మెంబెర్స్ వెంకటేశ్వరరావు సింహాచలం, వీరభద్రం చీఫ్ సూపెరింటెండెంట్లు, శాఖాపర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
