మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

-కేక్ కట్ చేసి సంబరాలు

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్,
మార్చి 8:

మందమర్రి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజని మాట్లాడుతూ శుక్రవారం హైదరాబాదులోని ఫరెడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ఇందిరా మహిళా శక్తి మిషన్ ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామికి ప్రత్యేక మహిళా దినోత్సవ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను గుర్తించి వారికి ప్రత్యేకంగా ఉచిత బస్సును ఇవ్వడం చాలా సంతోష దాయకమన్నారు.
మహిళలు ఇకపై పురుషులపై ఆధారపడే అవసరం లేకుండా ముందుకు సాగుతున్నారని మహిళలు ప్రతి అంశాలను స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారన్నారు. పురుషులతో సమానంగా ప్రతి పని చేయగలుగుతున్నారని
మహిళా శక్తి అసాధారణమైనదని మహిళ ఎక్కడ పనిచేసిన ఆ ప్రదేశం భోగ భాగ్యాలతో వర్ధిల్లుతుందన్నారు. ప్రపంచంలో మార్పు తెచ్చేందుకు ఎంతో కృషి చేస్తుందని పిల్లల్ని పెంచడం కుటుంబాన్ని నిర్మించడం పెద్దవారి బాగోగులు చూసుకోవడం వంటి వారిలో స్త్రీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. మహిళల విజయాలను తలుచుకొని నిర్వహించుకోవడానికి ఒక రోజు ప్రత్యేకంగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మన జీవితంలో సమాజంలో మహిళల ప్రాముఖ్యతను గుర్తించి వారికి తగిన అవకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో గోలేటి లక్ష్మి, కవిత, స్వరూప, మహేశ్వరి, లక్ష్మి, మౌనిక, సరిత, లావణ్య, లక్ష్మి ప్రసన్న, నిర్మల, రమాదేవి, లలిత, భాగ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking