ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 14:మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ ఆమోదించిన నోటు మేరకు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జాతీయ ఆరోగ్య మిషన్ & వెల్‌నెస్ సెంటర్, కూకట్పల్లిలో క్రింద పేర్కొన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.
ఖాళీల వివరాలు:
మినీ హబ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ – 02 పోస్టులు
వెల్‌నెస్ సెంటర్, కూకట్పల్లి డేటా ఎంట్రీ ఆపరేటర్ 01 పోస్టు
దరఖాస్తు విధానం:
దరఖాస్తు ఫారం 17.02.2025 సాయంత్రం 5:00 గంటల వరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధికారిక వెబ్‌సైట్
(https://medchal-malkajgiri.telangana.gov.in/) నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
భర్తీ చేసిన దరఖాస్తును సంబంధిత ధృవపత్రాల జిరాక్స్ కాపీలను మరియు రూ.500/- డీడీ (జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పేరిట) జతచేసి డి ఎమ్ హెచ్ ఓ,కార్యాలయం, ఎఫ్1, ఐ డి ఓ సి, అంతాయిపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చిరునామాకు సమర్పించాలి.
—
డా. సి. ఉమా గౌరి,
జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి,మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా