జిల్లా ఎస్.పి. శడి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
ప్రజాబలం దినపత్రిక మెదక్ జిల్లా ప్రతినిధి
16.10.2024:
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. గారు మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని మెదక్ జిల్లా పరిధిలో కల ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ మరియు అదేవిధంగా షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్.పి. శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. గారు తెలిపారు. పోలీస్ ఫ్లాగ్ డే పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఈనెల 21 న వారోత్సవాలు నిర్వహించబడుతాయని ఈ పోటీలకు విద్యార్థులతో పాటు, యువత ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ఉత్సహంగ పాల్గొనాలని అన్నారు. ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఇటీవల కాలంలో తీసిన (3) ఫోటోలు మరియు తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈనెల 20 వ తేదీ లోపు జిల్లా పోలీస్ కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 x 8 సైజ్ ఫోటోలను పోలీస్ పిఆర్వో కు అందజేయాలన్నారు.
ఈ పోటీలకు నామినేషన్లు పంపించే ఔత్సహికులు
👉 మూడనమ్మకాలు,ఇతర సామాజిక రుగ్మతలు
👉 అత్యవసర సమయాల్లో పోలీసులు స్పందన
👉 ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ
👉 ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను*
👉 సైబర్ నేరాలు ఈవ్టీజింగ్,ర్యాగింగ్*
👉 మత్తు పదార్థాల సేవనం వాటి అనర్దాలు
పెంపొందించే అంశాలకు సంబంధించి గత సంవత్సరం 2023 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటివరకు) తీసిన మూడు ఫోటోలు, షార్ట్ ఫిల్మ్ మాత్రమే పంపించాల్సి వుంటుంది. ఈ నెల 20 వ తారీఖు లోపు మెదక్ జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయంలోని ప్రో సెక్షన్ నందు ఇవ్వాల్సి వుంటుందని మరిన్ని వివరాల కోసం 8712529559, 9640474336 నెంబర్ ద్వారా పీఆర్ఓ ను సంప్రదించాలన్నారు.
సమాజంలో శాంతి భద్రత పరిరక్షణ కోసం శ్రమించి తమ అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న పోటీలకు విధ్యార్థులతో పాటు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. పిలుపునిచ్చారు.