దళిత కౌన్సిలర్ నూ వేధిస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం సమంజసమా.

తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ అవినీతి అరాచకాలపై బహిరంగ చర్చకు సిద్ధం.
నిజా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి.
అవినీతిపై చర్చించేందుకు ఎర్రోళ్ల శ్రీనివాస్
రావాలి.
తూప్రాన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ల డిమాండ్.

మెదక్ తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-

అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, ఆయనకు మద్దతు తెలుపుతున్న కౌన్సిలర్లకు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ బాసటగా నిలవడం విస్మయాన్ని కలిగిస్తుందని తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ ఆరోపించారు. రెండో వార్డు కౌన్సిలర్ మామిడి వెంకటేష్ స్వచ్ఛందంగా తమ వద్దకు వచ్చి చైర్మన్ రవీందర్ గౌడ్ అరాచకాలకు విసుగు చెంది అవిశ్వాసానికి మొగ్గు చూపారని తెలిపారు. కలెక్టర్ కు సమర్పించిన అవిశ్వాస పత్రంలో సంతకం చేసి తానే ముందు నడిచాడని పేర్కొన్నారు. దళిత కౌన్సిలర్ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని వైస్ చైర్మన్ తో పాటు మిగతా కౌన్సిలర్లు ప్రశ్నించారు. దమ్ముంటే చైర్మన్ అవినీతి అక్రమాలపై చర్చించేందుకు ఎర్రోళ్ల శ్రీనివాస్ తూప్రాన్ రావాలని వారు సవాల్ విసిరారు. గతంలో చైర్మన్ రవీందర్ గౌడ్ అక్రమాలపై మాజీ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లే విషయాన్ని వారు గుర్తు చేశారు. అక్రమార్కుడికి పార్టీ అండదండగా నిలవడంతో తామంతా న్యాయం జరిగే వైపు వెళ్లినట్లు పేర్కొన్నారు. నిన్న నిర్వహించిన మీడియా సమావేశానికి స్థానిక బిఆర్ఎస్ నేతలు దూరంగా ఉండడం చైర్మన్ అధర్మ పాలనకు చక్కటి నిదర్శనం అన్నారు. తూప్రాన్ మున్సిపల్ ప్రజల శ్రేయస్సు కోసమే అవినీతి చైర్మన్ గద్దె దించేందుకు అవిశ్వాసం పెట్టాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. అక్రమార్కులకు అండగా నిలుస్తున్న బిఆర్ఎస్ పార్టీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. చైర్మన్ అనాలోచిత వైఖరి మూలంగా గత అసెంబ్లీ ఎన్నికలలో తూప్రాన్ మున్సిపాలిటీలో 6000 మెజార్టీ తగ్గిందనే విషయాన్ని గుర్తు చేశారు. తూప్రాన్ మున్సిపాలిటీలో కులమత బేధం లేకుండా అన్నదమ్ముల కలిసిమెలిసి ఉంటామనే విషయాన్ని ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలుసుకుంటే మంచిదన్నారు. ఈ మీడియా సమావేశంలో వైస్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు , ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking