దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేది బిజెపి పార్టీ

 

భూ కబ్జాలు చేసేది బిఆర్ఎస్ పార్టీ

అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించేది కాంగ్రెస్ పార్టీ

విద్య నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించే నరేందర్ రెడ్డికే మా మద్దతు

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 22

దేశాన్ని అదాని,అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి చోద్యం చూస్తున్న పార్టీ బిజెపి పార్టీ అని తెలంగాణ రాష్ట్రంలో భూకబ్జాలకు పాల్పడుతూ కోట్లాది విలువైన భూములను కబ్జా పెట్టేది బిఆర్ఎస్ పార్టీ అని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు ప్రభుత్వ పథకాల ద్వారా సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ జన సమితి నాయకులు పట్టభద్రులకు పిలుపునిచ్చారు.శనివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అరికిల స్రవంతి తో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జమ్మికుంట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజాంబాద్ మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ గా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు కార్పొరేట్ విద్యతో తల్లిదండ్రులను ఆర్థికంగా దోచుకుంటున్న క్రమంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందుబాటులో ఉంచాలనే దృఢ సంకల్పంతో సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన నరేందర్ రెడ్డి ఆల్ ఫోర్స్ విద్యాసంస్థలను నెలకొల్పి వేలాదిమంది విద్యార్థిని,విద్యార్థులకు ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది దేశంలోనే ముఖ్యమైన వైద్య విద్యలో ఐఐటి కళాశాలలో ప్రముఖ ఉద్యోగ సంస్థల్లో అగ్రశ్రేణిలో నిలబెట్టడానికి తన వంతు కృషిచేసి విద్యార్థుల భవిష్యత్తు తన భవిష్యత్తుగా భావించి శ్రమించిన నరేందర్ ని ఎమ్మెల్సీగా గెలిస్తే పట్టభద్రుల హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడి హక్కులను సాధిస్తారని గణేష్ సూచించారు.విద్యార్థుల భవిష్యత్తు కోసం అనునిత్యం పాటుపడే నరేందర్ రెడ్డికి పట్టభద్రులంతా తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి నరేందర్ రెడ్డిని శాసనమండలికి పంపించినట్లయితే పట్టభద్రుల హక్కుల కోసం వినలేని కృషి సలుపుతారని మోరే గణేష్ ఈ సమావేశం ద్వారా పట్టభద్రులకు హామీ ఇచ్చారు.నరేందర్ రెడ్డి గెలుపు ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన మొదలైన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల్ ఫోర్స్ నరేందర్ ని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలనను మరింత ముందుకు తీసుకుపోవాలని ఆయన పట్టపద్రులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జన సమితి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి,యువజన సమితి జిల్లా అధ్యక్షులు కర్రే సతీష్ యాదవ్,యువజన సమితి నాయకులు పల్లెర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking