టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్.
మెదక్ ప్రజాబలం న్యూస్ :-
స్వర్గీయ ఆచార్య జయశంకర్ సార్ ఆశయ సాధనకు కృషి చేస్తామని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సంఘ భవనంలో ఏర్పాటుచేసిన సార్ జయంతి వేడుకలో మాట్లాడారు. 1969 విద్యార్థి ఉద్యమం నుండి మొదలుకొని మలి దశ ఉద్యమం వరకు నీళ్లు నిధులు నియామకాలు తదితర అంశాలలో తెలంగాణ ప్రాంతం వెనుకబడినది కాదని వెనుకబడేయబడ్డ ప్రాంతమని, అందుకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే శరణ్యమని తన పదునైన వ్యూహాలతో తెలంగాణ ప్రజలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం దిశగా పయనింపజేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన వ్యక్తి జయశంకర్ సార్ అని గుర్తు చేశారు. వారు చూపిన మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మానానికి దోహదపడినప్పుడే వారికి నిజమైన నివాళి అని తెలిపారు. అనంతరం వారి చిత్రపటానికి పూలమాలవేసి వినమ్ర నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గాండ్ల అనురాధ, జిల్లా సహా అధ్యక్షులు ఇక్బాల్ పాషా, కోశాధికారి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు పజిలుద్దీన్, కోటి రఘునాథరావు, సంయుక్త కార్యదర్శి పంపరి శివాజీ, రాధా, ఆర్గనైజింగ్ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, మెదక్ యూనిట్ అధ్యక్షులు ఆరేళ్ల రామా గౌడ్, ఉపాధ్యక్షులు సలీం, సంతోష్, హరికృష్ణ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.