విజయనగరం మార్చి 15 : మార్చ్ 28 న జనతాదళ్ యు రాష్ట్ర మహాసభను విజయనగరం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు జెడియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం తిరుపతి నాయుడు తెలిపారు విజయనగరంలోని వాసవి కళ్యాణ మండపంలో జిల్లా అధ్యక్షులు బోరగాపు రాజేశ్వర రావు అధ్యక్షత జరిగే ఈ సమావేశానికి కేంద్రం నుంచి ఇద్దరు ఎంపీలుహాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.ఈ సమావేశం లో రానున్న ఎన్నికల ద్రుష్ట్య రాష్ట్రము లో పార్టీ బలోపేతం, సబ్యత్వ నమోదు, జిల్లా బాడిలా నియామకం మొదలగు అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ సభకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వెంకటసుబ్బయ్య, కరణం తిరుపతి నాయుడు,కార్యదర్శులు కే రమణ, జనార్ధన, మల్లికార్జున్ రెడ్డి లతో పాటు ఆయ జిల్లాల అద్యక్స కార్యదర్శులు నాయకులు హాజరవుతున్నట్లు తిరుపతి నాయుడు తెలిపారు