మల్కాపూర్ లో బ్యాంకు రుణాలపై కళాజాత

ప్రజాబలం మెదక్ జిల్లా జనవరి 6
తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో నాబార్డ్ సౌజన్యంతో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ తూప్రాన్ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకు రుణాలపై కళాజాత ప్రదర్శన నిర్వహించారు. సహకార బ్యాంకు ద్వారా రైతులకు చేకూరుతున్న ప్రయోజనాలను ఆట పాటల రూపంలో కళాకారులు చక్కగా వివరించారు. వ్యవసాయ, వ్యవసాయేతర, చిన్న మధ్య తరహా వ్యాపార రుణాలు, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో గృహ రుణాలు, స్వదేశీ మరియు విదేశీ విద్య రుణాలు, వాహన రుణాలు, మహిళా సంఘాలకు రుణాలు తక్కువ వడ్డీకే సకాలంలో అంద చేస్తున్నట్లు తూప్రాన్ సహకార బ్యాంక్ మేనేజర్ లలిత తెలిపారు.. దీర్ఘకాలిక రుణాల మాఫీ అనేది ఉండదనే విషయాన్ని రైతులు మర్చిపోయి తాము తీసుకున్నారు రుణాలను చెల్లించి బ్యాంకుకు సహకరించాలన్నారు. ఇతర బ్యాంకులలో ఉన్న అన్ని సదుపాయాలు ఖాతాదారులకు సహకార బ్యాంకులో ఉన్నట్లు మేనేజర్ తెలిపారు.. సహకార బ్యాంకు కల్పిస్తున్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రైతులు, వ్యాపారులు, మహిళా సంఘాలు అధిక మొత్తంలో ఖాతాలను తెరిచి బ్యాంకు సేవలను ఉపయోగించుకోవాలని ఐకెపి ఏపీఎం రుక్మిణి, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ లు కోరారు.

ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ సుధాకర్, వివో ఏ సంతోష, రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking