జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి… మంత్రి సత్యవతి రాథోడ్‌

జయశంకర్‌ భూపాలపల్లి, జనవరి 05 ఈనెల 18వ తేదీన ప్రారంభం కానున్న కంటి వెలుగు`2 కార్యక్రమం నిర్వహణపై సవిూక్ష సమావేశంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ ` శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ….. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కంటి వెలుగు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం మొదటిదశ విజయవంతం అయింది.కంటి వెలుగు ` 2 కార్యక్రమం సంబంధించి గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో మేము పాల్గొన్నాము. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధ పడకూడదనే ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కనీసం దవాఖానలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది పేదలు, అభాగ్యుల జీవితాల్లో కంటి వెలుగు ద్వారా వెలుగులు నింపుతున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎక్కువమందికి స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించిన రాష్ట్రం తెలంగాణ. ఈ ఏడాది గిన్నిస్‌ బుక్‌ రికార్డులోకి ఎక్కే విధంగా ప్రతి ఒక్కరు సమన్వయంతో కృషి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు పథకాన్ని 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి.ఇక్కడున్న 251 గ్రామపంచాయతీలు, 30 మున్సిపల్‌ వార్డులకు సంబంధించి 25 టీమ్‌ లను ఏర్పాటు చేసుకున్నాము.100 రోజుల కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయం చేసుకొని ప్రతి గ్రామంలో విజయవంతం చేయాలి. గ్రావిూణ ప్రాంతాల్లో గంట ముందు నుండి స్క్రీనింగ్‌ పరీక్షలు ప్రారంభింస్తే ఎక్కువ మంది లబ్ధి పొందుతారు. వ్యవసాయ పనులు, కూలీ పనులకు వెళ్తున్నవారికి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే టీమ్‌ లు చేరుకోవాలి. కంటి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఎక్కువ శాతం సమస్యలు ఉంటే వారికి మందులతో అందుకు సంబంధించిన అద్దాలను అక్కడ సెంటర్‌ నుండి బుక్‌ చేసి వారం ,పది రోజుల్లో ఏఎన్‌ఎం ల ద్వారా ఆశ వర్కర్ల ద్వారా ఇంటికి తీసుకువచ్చి అందించడం జరుగుతుంది. గ్రామపంచాయతీ పక్కన హ్యాబిటేషన్స్‌ ఉండి అక్కడ ఎక్కువమంది ప్రజలు ఉంటే క్యాంపు నిర్వహించవలసిందిగా సూచిస్తున్నాను. జిల్లా సవిూక్ష అనంతరం మండలాల వారిగా ప్రజా ప్రతినిధులు,అధికారులు సవిూక్షలు నిర్వహించాలి.గ్రామాల వారిగా ఏ రోజు క్యాంపు నిర్వహిస్తారు అనే విషయం సర్పంచులు తప్పనిసరిగా డప్పు చాటింపుల ద్వారా ప్రజలకు సమాచారాన్ని చేరవేయాలి. ప్రజా ప్రతినిధులు అధికారులు సవిూపంలోని కంటి పరీక్ష కేంద్రాలను సందర్శించాలి. తద్వారా ఎక్కువమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం లేదు.మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి పేదల పట్ల ఉన్న ప్రేమకు ఇది ఒక నిదర్శనం.శాసన సభ్యులు, కలెక్టర్‌ మున్సిపల్‌ చైర్మన్‌, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలి. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కంటి పరీక్ష చేయించుకునే విధంగా ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి. కంటి వెలుగు కార్యక్రమం గిన్నిస్‌ బుక్‌ రికార్డులో చోటు దక్కించుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు గండ్ర వెంకటరమణరెడ్డి, జిల్లా వయాప్తంగా కలెక్టర్‌ భావేశ్‌ మిశ్రా, జెడ్పీ ఛైర్మెన్‌ జక్కు శ్రీహర్శిని, ఎంపీపీ రాణీబాయి, మల్లారెడ్డి, సమ్మయ్య, మలహర్‌ రావు, జెడ్పీటీసీ తిరుపతి రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking