ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 17 : జాతరను మంచిర్యాల అశోక్ రోడ్ లోని కట్ట పోచమ్మ ఆలయం వార్షికోత్సవం సంధర్భంగా ఆషాఢమాసం పురస్కరించుకుని బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు.హమాలివాడ లోని హనుమాన్,సాయిబాబా ఆలయం నుంచి మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని పోచమ్మ ఆలయం వరకు శోభాయాత్ర జరిపారు.ఈ జాతరలో జోగిని శ్యామల, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతుల తనయుడు చరణ్ రావు,కోడలు శైలేఖ్య పాల్గొన్నారు.శైలేఖ్య కూడా బోనం ఎత్తుకున్నారు.అనంతరం పోచమ్మకు బోనం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు.ఈ జాతరలో మహిళలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.