హైదరాబాద్ ఏప్రిల్ 24 ():ప్రముఖ పండితుడు శాసనాల చారిత్రిక పరిశోధకుడు కవి గోమాత భక్తుడు డాక్టర్ కావూరి శ్రీనివాస శర్మను ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా,గో సేవా విభాగానికి జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడిగా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్, ఐపీసీ అడ్వైజర్ ప్రముఖ సీనియర్ పాత్రికేయులు సూర్య ప్రకాష్ నియామక ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో ఐపిసి గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జ్ జగదీష్ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ శ్రీనివాసరావు హైదరాబాద్ యూత్ విభాగం అధ్యక్షుడు నవీన్ క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ నంది కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ శర్మ గారు మాట్లాడుతూ ఐపిసి పంచ సూత్రాలైన మాతృ ప్రేమతో పరిపాలన ప్రతి మనిషికి విద్య వైద్యం ఉచితం భారతదేశ మొత్తం సంపూర్ణ మద్యపాన నిషేధం మతసామరస్యాన్ని పాటిస్తూ గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించడం మానవసేవే మాధవసేవ లను ప్రజల్లోకి తీసుకెళ్లి ఐపీసీ పార్టీ బలోపేతానికి చేస్తానని తెలిపారు.