నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్ ను గద్దె దించాలి..

 

నిర్మల్ చేరుకున్న యువ పోరాట యాత్ర..
ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్ ను గద్దించాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి అన్నారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన యువ పోరాట యాత్ర గురువారం నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. స్థానిక బైల్ బజార్ వద్ద యువజన కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి బుధవార్ పేట్, పాత బస్టాండ్ మీదుగా వివేక్ చౌక్ కు చేరుకొని కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు 1.7 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, లేదంటే ప్రతి నిరుద్యోగికి రూ.1.60లక్షల నిరుద్యోగ భృతిని అందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగ యువతకు వయస్సు భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది తమ ప్రాణాలు అర్పిస్తే కేవలం 600 మందిని మాత్రమే ఆదుకున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆత్మార్పణ చేసిన అందరికీ పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.మరో నాలుగు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగిపోవడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అలాగే నిరుద్యోగులకు రూ.4 వేల నిరుద్యోగ భృతిని అందిస్తామన్నారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, నిర్మల్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ అక్రమంగా బనాయించే కేసులకు భయపడేది లేదని ఎన్ని కేసులు పెట్టిన ధైర్యంగా ఎదుర్కొంటూ కేసీఆర్ పై పోరాటం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్హా, జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి వేడుమ బొజ్జ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాజిద్ అహ్మద్ ఖాన్, మాజీ కౌన్సిలర్ గణేష్, నాయకులు అర్జుమాన్ అలీ, అజహర్, జునైద్ మెమన్, మతిన్ చిన్ను, అతిక్ అహ్మద్, బొల్లోజు నర్సయ్య, రమణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పడాల శ్రీనివాస్, కొంతం గణేష్, గంగోని బురాజ్, రాథోడ్ వెంకటేష్, సయ్యద్ అజహర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking