మండల స్థాయి గ్రామ స్థాయి కార్యకర్తలతో నే గెలుపు సాద్యం మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 26: మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం ఇందారం గ్రామంలో నియోజకవర్గం లోని మండల గ్రామస్థాయి నాయకులతో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఎల్ డి ఎమ్ ఆర్ లీడర్ షిప్ డెవలప్మెంట్ మిషన్ లో భాగంగా ముఖ్యఅతిధులుగా విచ్చేసిన ఎల్ డి ఎమ్ ఆర్ ఇంఛార్జి అర్షద్,అంజన్ కుమార్,నియోజకవర్గం ముఖ్య నేతలతో కలిసి రాబోవు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం బూత్ స్థాయినుండి అవాలంభించాలిసిన విధి విధానాలను బూత్ స్థాయి నాయకులకు వివరించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీపీసీసీ డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ డా,దాసారపు శ్రీనివాస్ మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అధిష్టానం ఆదేశాల మేరకు శక్తి వంచన లేకుండా పని చేస్తానని వివరించారు. తధనంతరం డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో భూపతి శ్రీనివాస్ చెన్నూరు కోఆర్డినేటర్ ,పిన్నింటి రఘునాథ్ రెడ్డి,ఎండీ ఫయాజ్ద్దన్ ,అసంపెల్లి శ్రీకాంత్,పుల్లూరి లక్ష్మణ్, పల్లె రాజు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.