గౌడ్స్ వృత్తి గీత… తాటి, ఈత చెట్ల నుంచి పానీయం తీసి సురులకు అందించిన పానీయమే సురా పానీయం… నాడు గౌడ్స్ కి వుబున శక్తితో చెట్టును వంచి పానీయం తీసేవారు… తదనంతరం వేలు పెడితే కళ్ళు వచ్చేది … తర్వాత పరిణామక్రమంలో చెట్టి ఎక్కి కళ్ళు తీశారు… ఈ వివరాలన్నింటినీ ఒకే చిత్రంలో చిత్రకారుడు పొందుపరిచిన చిత్రాన్నీ బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు, ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కి తెలంగాణ గౌడ్ సంఘం అధ్యక్షుడు, గౌడ్ హాస్టల్ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ ప్రగతిభవన్లో బుధవారం కలిసి అందజేశారు. చిత్రాన్ని చూపిస్తూ గౌడ్ చరిత్రని వివరించారు. ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం రాష్త్ర నాయకులు చిదుగు గోవర్ధన్ గౌడ్ , కొండా రమేష్ గౌడ్, సంజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు .