హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 8
నూతన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి)అధ్యక్షుడిగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాదులోని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు సుంకరి,రమేష్ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు ఇంగిలే రామారావు లు కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కు బోకే అందించి శాలువా కప్పి సన్మానించారు. అలాగే హైదరాబాద్ లో నూతనoగా వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా నియమితులైన ఎం కోదండరెడ్డిని కలసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించేలా మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కష్టపడి పని చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని దానికి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కావడమే ఉదాహరణ అని అన్నారు.