మెదక్ తూప్రాన్ డిసెంబర్ 25 ప్రాజబలం న్యూస్ :-
మనుస్పృతి దహనం తెలంగాణ రాష్ట్ర అంబెడ్కర్ సంఘం ఆధ్వర్యంలో పడాలపల్లీ అంబెడ్కర్ విగ్రహం వద్ద మనుస్మృతి గ్రంధాన్ని దహనం చేశారు. డా బి ఆర్ అంబేడ్క్ గారు 1927 డిసెంబర్ 25 రోజున వేలాది మందితో మనుస్మృతి గ్రంధాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అధ్యక్షులు ముకాద్ధం సుధాకర్,
ప్రధాన కార్యదర్శి ముకాద్దం నరసింగరావు
తూప్రాన్ మండల ప్రధాన కార్యదర్శి కానుకుంట సుదర్శన్, మల మహానాడు జిల్లా అధ్యక్షులు నంది సురెందేదర్ లు మాట్లాడుతూ భారత రాజ్యాంగం నిర్మించకముందు మనుధర్మ శాస్త్రం అమలులో ఉండేది దానివల్ల మనిషిని మనిషిగా గుర్తించలేదు. ఈ మనుధర్మ శాస్త్రం లో శూద్రులకు, అతి శూద్రులకు విద్య ను అభ్యసించకుండ, తెలివికి, జ్ఞానానికి దూరంగా , మహిళలకు కూడా స్వేచ లేకుండా చేసేది మనుధర్మ శాస్త్రం. ఇలాంటి మనుధర్మ శాస్త్రం ను సమాజానికి మంచిది కాదు అని ఆరోజుల్లోనే మనుమృతి గ్రందని బహిరంగ దహనం చేశారు. ఎవరికైన అభ్యంతరాలు ఉంటే మీరు అడ్డుకోవచని మనువాధులకు తెలియజేసిన ఎవరు స్పందించలేదు. అంబేడ్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన బాటలో నడుస్తమని అంబెడ్కర్ సంఘం నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు కానుకుంట బాబు, బిక్షపతి, ఉపాధ్యక్షులు మునిరతి దాస్, కనుకుంట నాగేశ్వరరావు, నితిన్, నంది, విజయ్, చిన్నబాబు, భూపతి రాజు, వంశీ మరియు అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.