తెలంగాణ లో రేపటి తరం మనదే అందుకే పునాది గట్టిగా నిర్మిద్దాం
సుస్థిర పాలన కేవలం బిజేపి తోనే సాధ్యం
:- బిజేపి జాతీయ నాయకుడు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్.
తూప్రాన్, డిసెంబర్, 13.ప్రాజబలం న్యూస్ :-
భారత దేశ పురోగమనం,సమగ్రత,రక్షణ నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి తోనే సాధ్యం అని బిజెపి జాతీయ నాయకుడు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం ఉమ్మడి తూప్రాన్ మనోహరాబాద్ మండల ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
స్వాభిమాన స్వాలంబన అనేది భారతీయ జనతా పార్టీ తోనే స్వర్ణ భారతం నిర్మాణం అవుతుందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికలు భారత దేశ ఔనత్యాన్ని ఇనుమడింప చేసేటివని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి పార్టీ నీ గెలిపించండి అని పిలుపునిచ్చారు. తెలంగాణ లో రేపటి తరం మనదే అందుకే వార్డు,సర్పంచ్,ఎంపిటిసి,ఎంపిపి, జడ్పీటిసి లలో విజయం సాధించి పునాది గట్టిగా నిర్మిద్దాం అని ఈటెల రాజేందర్ అన్నారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజక వర్గంలో గతంలో 1600 ఓట్లు రాగా నేడు 67 వేలకు పైగా ఓట్లు వచ్చాయని ఓటింగ్ శాతం అమాంతం భారీగా పెరిగిపోయిందని అన్నారు. సుస్థిర పాలన కేవలం బిజేపి తోనే సాధ్యం అని అన్నారు. గత 30 ఏళ్లుగా సీనియర్ నాయకులు బిజెపి లో నిస్వార్థం తో సమన్వయంగా కలిసి కట్టుగా పని చేస్తున్నారనీ కొత్త వారు ఇతర పార్టీల నుండి వేలాది మంది నాయకులు కార్యకర్తలు అభిమానులు బిజేపి లో చేరిన వారిలో పెద్ద పెద్ద హోదాలో పని చేసిన వారికి సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత బిజెపి నాయకులపై ఉందని అన్నారు. గతంలో జరిగిన విషయం పట్టించుకోకుండా నిత్య నూతన ఉత్తేజం గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. గ్రామ స్థాయి నుండి బిజెపి పార్టీ పటిష్టం చేసి ప్రజల విశ్వాసాన్ని చురగొని ప్రజల ఆశీర్వాదంతో గెలిస్తే గొప్ప నాయకుడు అవుతాడని అన్నారు. పాత కొత్త నాయకులు, కార్యకర్తలు అభిమానులు అందరూ కలుపుకొని కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గా ఓడిన, ఎంపి గా గెలిచినా అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికీ ఆపదలో, కష్టంలో, సంపతిలో ఎక్కడ అవసరం ఉన్నా తాను అండగా ఉంటా అని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ రామునిగారి మహేష్ సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు, కాల్లాకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజు, కుచారం సర్పంచ్ జక్కిడి నరేందర్ రెడ్డి,బుల్లెట్ రాజు, పుడురు నర్సారెడ్డి, కిష్టాపూర్ సర్పంచ్ పోచయ్య, ధర్మరాజుపల్లి సర్పంచ్ చంద్ర శేఖర్, గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గడిపల్లి భాస్కర్, రాష్ట్ర నాయకులు గిరీష్ రెడ్డి, వర్గల్ రాంరెడ్డి, నాచారం నందుగౌడ్, ములుగు మాజీ జడ్పీటిసి సురేష్ గౌడ్, జగ్గన్నగారి అంజిరెడ్డి, నరేందర్ చారి, బిజెపి టౌన్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, పోతురాజు నాగరాజ్, మధు, ఆంజనేయులు, సిద్ధిరాములు యాదవ్, మధుసూధన్ రెడ్డి, మాజీ ఎంపిపి గుమ్మడి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ లు వీర్ కుమార్ గౌడ్, శివ్వమ్మ, ఐలయ్య, బాల పోచయ్య, కౌన్సిలర్ నర్సోజి, నాయకులు భూమన్నగారి యాధాగౌడ్, భూమన్నగారి జానకిరామ్, మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ యాదవ్,మాసాయిపేట అంజాగౌడ్, బండారు దుర్గ రాజు యాదవ్, స్వర్గం మురళి, గడ్డం రవీందర్ ,గౌడిగూడం వెంకట్ రామ్ రెడ్డి,అజయ్, తాటి విఠల్, కంటయపాలెం వేణుగోపాల్, వాగుగడ్డ నర్సింహా రెడ్డి, మల్లేష్ యాదవ్, సాయిబాబా, శేఖర్, నాని, గట్టు అమర్ గుప్త, వీరభద్రమ్, కమ్మరి శ్రీనివాస్ చారి, కొండ సిద్దిరాములు యాదవ్, దాతర్ పల్లి సాయిబాబా లింగారెడ్డిపేట వెంకట్ చారి తదితరులు పాల్గొన్నారు.
