ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
నూతన సంవత్సరంలో నిర్మల్ జిల్లా మరింత ప్రగతి సాధించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకాంక్షించారు.అన్ని రంగాల్లో జిల్లాను ముందంజలో నిలిపేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.
గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా అధికారులు,పలు కార్యాలయాల సిబ్బంది కలెక్టర్ అభిలాష అభినవ్ ను కలిసి పూలమొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అధికారులు, కార్యాలయాల సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు నూతన సంవత్సరం లో కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాలని తెలిపారు. అధికారులు, సిబ్బందికి కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ,జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని,ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో ఉండాలని,అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని,పంటలు సమృద్ధిగా పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు.ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని,జిల్లాను మరి సుసంపన్నం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
కలెక్టర్ ను కలిసేందుకు వచ్చిన వారందరు నోట్ బుక్కులు తీసుకురాగా,కలెక్టర్ వాటిని వసతి గృహాల విద్యార్థులకు పంపిణీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.నూతన సంవత్సరం సందర్భంగా విద్యార్థులకు తోడ్పాటును అందించిన వారందరికీ జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు