మెదక్ ఎంపీ రఘునందన్ రావు
ప్రజాబలం దినపత్రిక – మెదక్ జిల్లా ప్రతినిధి
06-09-2024:
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నిత్య పూజలు నిర్వహించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
వినాయక చవితి పండుగను పురస్కరించుకోని మట్టి వినాయకులను శుక్రవారం కలెక్టర్ కార్యాలయం భక్తులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ రసాయన విగ్రహాలను చెరువులు, కుంటల్లో వేయడంతో అవి కరిగేందుకు నెలల తరబడి సమయం పట్టడమే కాక నీరంతా కలిషితమవుతుందన్నారు. పర్యావరణం కలుషితం కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని పిలుపునిచ్చారు.
జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు, అదికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.