లైబ్రేరియన్ భీమారావు సేవలు అభినందనీయం

 

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.రాజశేఖర్.

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మే 31

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంటలో శుక్రవారం రోజు నాడు భీమారావు పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రాజశేఖర్ మాట్లాడుతూ భీమారావు 37 సంవత్సరాలు ఉత్తమ గ్రంథ పాలకునిగా సేవలు అందించారని, అంతేకాకుండా ఎంతో మంది విద్యార్థులను మంచి పాఠకులుగా తీర్చిదిద్దీన ఘనత వారికి దక్కిందని కొనియాడారు. వైస్ ప్రిన్సిపల్ ఎడమ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భీమారావు తన 50 సంవత్సరాల వయసులో సెట్ (స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్)ఓపెన్ కేటగిరిలో క్వాలిఫై ఎందరికో మార్గదర్శి అయినారని,ఆయన నిత్య విద్యార్థి అని అభినందించారు. స్టాఫ్ సెక్రటరీ డాక్టర్ ఎం. రామ్మోహన్రావు మాట్లాడుతూ భీమరావు లైబ్రేరియన్ విధులు నిర్వర్తించినా ఆ గ్రంథాలయాన్ని ఉత్తమ గ్రంథాలయంగా తీర్చిదిద్ది, విద్యార్థులకు అనునిత్యం పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలో తగిన సూచనలు సలహాలు ఇస్తూ ఉండేవారని అన్నారు. తెలుగు అధ్యాపకులు ఈశ్వరయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో విజ్ఞాన జిజ్ఞాసను సదా పెంపొందించిన సేవా తత్పరుడు భీమా రావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పి.డి సుజాత, డాక్టర్ బి.సువర్ణ, డాక్టర్ వి.స్వరూపరాణి, డాక్టర్ ఎంబడి రవి, డాక్టర్ రవి ప్రకాష్, పి. శ్రీనివాస్ రెడ్డి, ఎల్. రవీందర్, ఎన్. మమత, కె. సుధాకర్, ప్రశాంత్ ,సాయి ,అరుణ్ రాజ్ ,కిరణ్, శ్రీనివాస్, భీమారావు కుటుంబ సభ్యులు బంధువులు, శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking