కలెక్టర్ కార్యాలయంలో గణపతి ఘనంగా పూజలు..

 

అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

ప్రజా బలం దినపత్రిక- మెదక్ జిల్లా ప్రతినిధి
09-09-2024:

మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన గణపతికివినాయక చవితి నవరాత్రులు సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసినపరిపాలన గణనాథుడికి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు విశేష పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులతో జిల్లా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాజు గౌడ్, ఏడి మైన్స్ ప్రవీణ్ రెడ్డి, ఇరిగేషన్ ఈ.ఈ శ్రీనివాసరావు, మైనారిటీ సంక్షేమ అధికారి జామలా నాయక్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking