మహా శివరాత్రి మహోత్సవం ఆహ్వాన పత్రికను అందించిన

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆలయ అర్చకులు
జూబ్లీహీల్స్‌ ప్రజాబలం ప్రతినిధి:వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన మహా శివరాత్రి మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని ఆహ్వానించారు. ప్రభుత్వ విప్‌, శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్‌ తో పాటు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు, అధికారులు జూబ్లీహిల్స్‌ నివాసంలో ముఖ్యమంత్రి ని కలిసి ఆ మేరకు ఆహ్వాన పత్రికను అందించారు.
ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రి ఆ ప్రతినిధి బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking