దేశ చరిత్రను తిరగరాసిన మహనీయుడు గాంధీ

యువత గాంధీ అడుగుడు జాడల్లో నడవాలి.

దొడ్ల.వెంకట్,తెలంగాణ ప్రజాశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు.

ఈరోజు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రజాశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దొడ్ల వెంకట్ స్థానిక గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
లండన్ లో తన న్యాయ విద్యా పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వచ్చిన గాంధీ కి ఆంగ్లేయుల అరాచకాలు దర్శనమిచ్చాయి. అప్పుడే దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని పట్టుదలతో సత్యం,ఆహింసా ను తన ఆయుధంగా మార్చుకొని శాంతి యుతంగా రక్తం చిందించకుండా విదేశీ వస్తు బహిష్కరణ,సహాయ నిరాకరనోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, ఇలా అనేక పోరాటాలు చేసి ఆంగ్లేయుల గుండెల్లో భయాన్ని కలుగజేసి స్వాతంత్య్రం సిద్ధించడంలో ప్రముఖ పాత్ర వహించారు. చివరకు 1945 లో స్వాతంత్రం స్వాతంత్రం దించడమా లేకపోతే మరణమ అని భావించి ఉద్యమాన్ని ఉగ్రరూపానికి తీసుకొచ్చారు. గాంధీ యువత దేశానికి ఆయువు పట్టని, పల్లెలే పట్టుకొమ్మలని భావించారు. నేటి ప్రభుత్వాలు యువతను మద్యానికి బానిసలు చేసి పచ్చని పల్లెలను బెల్టులు షాపులు గాను మార్చి యువతను పూర్తిగా నశింపజేస్తున్నటువంటి ఈ నాయకులు మారాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజాశక్తి పార్టీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కట్కం. వీరేష్ గుప్తా, బీసీ సంఘం నాయకులు సత్యనారాయణ గౌడ్, పురం అరవింద్ గుప్తా, ఈ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking