వందల సంవత్సరాల గణ చరిత్ర గల నరసింహస్వామి దేవాలయంలో
ప్రత్యేక పూజలు
హాజరైన మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరిక్రిష్ణ.
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్:-
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని రామాలయం సమీపంలో పెద్దపెద్ద గుండ్ల మధ్యలో వందల సంవత్సరాల క్రితం వెలసిన కూర్మ నరసింహ స్వామి దేవాలయ లో శనివారము పంచామృత అభిషేకము స్వామివారి కలంకరణ ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకము, చందనాలంకరణ, ఆకు పూజ, అగ్ని ప్రతిష్టాపన మూల మంత్ర హవనములు స్వామివారికి మహా నైవేద్యం , సుదర్శన హోమం వేద పండితుల మధ్య వీశెష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు
శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ మామిండ్ల కృష్ణ, కంటాయపాలెం వేణుగోపాల్,, శ్రీ సూక్తం విద్యాసాగర్ ,, పేర్ల లక్ష్మణ్, గడ్డం ప్రశాంత్ కుమార్, పంచాయతీరాజ్ డిఇ నర్సింలు, అర్యవైశ్యా సంఘం నాయకులు ఉప్పల నర్సింహులు గుప్తా, లక్ష్మణ్ రావు, తీగల అంజయ్య, దేవత వెంకటేశం ఉప్పల రమేష్, అహోబిలం ప్రవీణ్ కుమార్ హరిప్రసాద్, శివ్వంపేట మండల సర్పంచ్ లు , ఎంపీటిసిలు , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.