ప్రజాబలం బెల్లంపల్లి నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 08 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండం కన్నాల గ్రామ పంచాయితీలోని మెయిన్ రోడ్డు హైవే 363లో గల బంగారు మైసమ్మ ఆలయంలో మంగళవారం రాత్రి దొంగతనం తేదీ: 08/01/2025 రోజున ఉదయం అయ్యగారు వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉండడంతో ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించడంతో పోలీసులకు పిర్యాదు చేసిన వెంటనే స్పందించిన పోలీసులు తాళ్లగురిజాల సీఐ అఫ్జాలోద్దీన్ ఎస్సై రమేష్ , డాగ్ స్క్వాడ్ తో ఆలయం వద్దకు వచ్చి సోదాలు నిర్వహించారు,ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం 15 తులాల వెండి, పావు తులం బంగారు ముక్కు పుడక దొంగిలించినట్లు నిర్ధారించారు,ఈ కార్యక్రమలో ఆలయకమిటీ అధ్యక్షులు గెల్లి రాజలింగు,కానగంటి కుమార స్వామి సెస్రటరీ,పూజరీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాతరీ స్వామి,తదితరులు పాల్గొన్నారు.