పత్తి కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలీ..

 

అధికారులను ఆదేశించి నా..

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజాబలం దినపత్రిక
మెదక్ జిల్లా నియోజకవర్గం
17.10.2024:
గురువారం ఐ డి ఓ సి కార్యాలయపు కాన్ఫరెన్స్ హాల్లో పత్తి కొనుగోలు ప్రక్రియపై అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి మార్కెటింగ్, సహకార, సిసిఐ, పోలీస్,అగ్నిమాపక, వ్యవసాయ కాటన్ మిల్లుల యజమానులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పత్తి కొనుగోలు ఏర్పాట్లకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పత్తి కొనుగోలు సీజన్ ప్రారంభం అవుతున్నదని సిసిఐ ద్వారా కొనుగోలు చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. నవంబర్ మొదటి వారం నుండి పత్తి కొనుగోలు కేంద్రాలకు వస్తుందని తెలిపారు. జిల్లాలో 36 వేల142 ఎకరాలలో పత్తి సాగు జరిగిందని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోలు సజావుగా, సక్రమంగా సాగేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లాలో ఈ నెల 25 వ తేదీ వరకు పత్తి కొనుగోళ్ళు ప్రారంభించాలని ప్రతి రోజు
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనుగోలు జరపాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. సీసీఐ ద్వారా మాయిచ్చర్ మిషన్, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని పోలీస్ శాఖకు సూచించారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో స్థానిక పోలీస్ అధికారుల నెంబర్లు, అత్యవసర నంబర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. తూనికలు కొలతలు శాఖ ద్వారా ప్రతి కొనుగోలు కేంద్రాలలో
కాంటాలకు స్టాంపింగ్ చేయాలని ఆదేశించారు. గోదాములు, మిల్లుల వద్ద అగ్నిపాక శాక ద్వారా అగ్నిప్రమాదాలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని అన్నారు.
cotally యాప్ ను రైతులు డౌన్లోడ్ చేసుకోవాలని, రైతుల ఖాతాలలో డబ్బులు జమ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. మద్దతు ధర 7521 రూపాయలుగా ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
యాప్ గురించి వ్యవసాయ శాఖ అధికారులు పంచాయతీ కార్యదర్శులు ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
ఈ సమావేశంలో మార్కెటింగ్ అధికారి యాదయ్య జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు అగ్నిమాపక అధికారి వేణు లీగల్ మెట్రాలజీ అధికారి సుధాకర్ జిల్లా రవాణా అధికారి జి శ్రీనివాసరావు మండలాల అగ్రికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking