-రిథం డాన్స్ పోటీల పోస్టర్ ఆవిష్కరణలో ఎస్.ఐ రాజశేఖర్
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 20:
రిథమ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1, 2 తేదీలలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు విజయవంతం కావాలని మందమర్రి ఎస్సై శివనీతి రాజశేఖర్ అన్నారు. సోమవారం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో రిథమ్ డాన్స్ అకాడమీ రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీల పోస్టర్స్ ను కరపత్రాలను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు కృషి చేస్తున్న రిథమ్ డాన్స్ అకాడమీ కొరియో గ్రాఫర్ ఉడుత సాగర్ ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి తమ పోలీస్ శాఖ నుండి సహకారం అందిస్తామని ఆయన అన్నారు. ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఉడత సాగర్ మాట్లాడుతూ రిథమ్ డాన్స్ అకాడమీ సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పోటీల్లో పాల్గొన్న విజేతలకు 55వేల 555 నగదును అందజేస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారులు సాధనవేణి ప్రభాకర్, ఏగ్గేటి రాజేశ్వరరావు, ఉప్పులేటి నరేష్, రాకం సంతోష్, వెల్తురు పోషం, నీలాల శ్రీనివాస్, రిదం సది, సునార్కర్ రాంబాబు, దుర్గం కృష్ణ, నర్సింగ్, క్రేజీ విజయ్, ఉప్పులేటి రాజమౌళి, తాజ్, తిరుపతి, గౌరేష్, స్టాలిన్, టీంకు, అరవింద్, సాయి, ఎం.సాయి, అబ్బూరి రాజు తదితరులు