మెదక్ జిల్లా టివిఏసి జెఏసి జాయింట్ సెక్రటరీ బి.చంద్రబానప్ప
ప్రజాబలం దిన పత్రిక
మెదక్ జిల్లా పాపన్నపేట్
25.09.2024
నేడు హైదరాబాద్ లోని విద్యుత్ మింట్ కంపౌండ్ నందు జరిగే ఆర్టిజన్ మహా ధర్నాను విజయవంతం చేయాలని మెదక్ జిల్లా టివిఏసి జెఏసి జాయింట్ సెక్రటరీ బి.చంద్రబానప్ప బుధవారం రోజు ఓక ప్రకటనలో తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ
టిజిఎస్ డిసిఎల్ లో 2,200 జె ఎల్ఎం పోస్టులకు గాను యాజమాన్యం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని,ఈ నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలని జేఏసీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లేబర్ గా ఉన్న విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు గత ప్రభుత్వంలో ఆర్టిజన్ గా గుర్తించినప్పటికి ఏలాంటి బెనిఫిట్స్ అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుత ప్రభుత్వంలోనైనా ఆర్టిజన్స్ ని కన్వర్షన్ చేసి జేఎల్ఎం పోస్టులలో భర్తీ చేయాలని యాజమాన్యాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే టివిఏసి జెఏసి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం రోజు ధర్నా కార్యక్రమంకు పిలునివ్వటంజరిగిందని ఆర్టిజన్స్ కార్మికులు మింట్ కాంపౌండ్ టిజిఎస్పిడిసిఎల్ సిఎండి కార్యాలయం వద్ద అధిక సంఖ్యలో పాల్గొని మన నిరసనను యాజమాన్యానికి తెలియజేయాలని కోరారు. ఆర్టిజన్స్ సోదరీ సోదరులు ఈ ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.