ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29 : మంచిర్యాల అగ్రికల్చర్ కార్యాలయం సూపరింటెండెంట్ ను మంగళవారం బాధ్యతలు చేపట్టిన వసంత కుమారు ను మంచిర్యాల టీఎన్జీవో యూనిట్ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, నాయకులు ప్రశాంత్, అశోక్,విజయ, స్వరూప,కార్తీక్ కుమార్ పాల్గొన్నారు. టీఎన్జీవో యూనిట్ నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు తెలిపారు.