రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 03 అక్టోబరు 2024
మణికొండ మున్సిపాలిటీ బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో తీర్మానించిన విధంగా గురువారం రోజున ఉదయం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధనరాజ్, సీనియర్ నాయకులు మహమ్మద్ కలీం, షేక్ ఆరిఫ్ ల ఆధ్వర్యంలో మణికొండ మున్సిపాలిటీలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునే విధంగా డాలర్ హిల్స్ కాలనీ, ఖిజ్రా కాలనీ తదితర ప్రాంతాలను సందర్శించడం జరిగిందని, మంచినీటి సరఫరా ఎత్తైన ప్రదేశానికి చేరే విధంగా సంవత్సరం క్రితమే డాలర్ హిల్స్ దగ్గర ఒక బూస్టర్ నిర్మించడం జరిగింది. ఇట్టి బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ లేదని కొద్దికాలం పాటు తరువాత ఇతరత్రా సాంకేతిక కారణాల వల్ల వినియోగం లోకి రాలేదని ప్రజాబి ప్రాయ సేకరణలో తెలియ వచ్చింది, ఈ బూస్టర్ పనిచేయని కారణంగా కొన్నిసార్లు వారానికి ఒక రోజు కూడా త్రాగు నీరు రావడం లేదన్న విషయం స్థానికులు మొర పెట్టుకున్నారు మరియు మంచి నీటి పైప్ లైన్ సదుపాయం కొరకు స్థానికులు కొంత మంది డబ్బులు చెల్లించి నప్పటికీ మెయిన్ రోడ్ లో కొంతమేర లైన్ వేయని కారణంగా వారికి కనెక్షన్ రాలేదని తెలిసింది.

కావున హైదరాబాద్ వాటర్ వర్క్స్ వారు సత్వరమే స్పందించి డాలర్ హిల్స్ దగ్గర ఉన్న బూస్టర్ పని విధానాన్ని మెరుగు పరచాలని మరియు మెయిన్ రోడ్ లో కొదువ గల పైప్ లైన్ పూర్తి చేయాలని కోరడమైనది. తదుపరి కిజ్రా కాలనీ లోని మసీదు కొరకు పంచాయతీ పరిపాలనా సమయంలో వేసిన బోరును మసీదుకు ఉపయోగించకుండా ప్రస్తుతం ప్రైవేట్ పరం చేయడం జరిగిందని స్థానికులు భాధ పడుతూ తెలిపారు. కావున మణికొండ మున్సిపాలిటీ వారు స్పందించి ఆ బోరును మసీదుకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ మణికొండ మున్సిపాలిటీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, రూపా రెడ్డి, అందే లక్ష్మణ రావు, బొడ్డు శ్రీధర్, సంగం శ్రీకాంత్, ముత్తంగి లక్ష్మయ్య, యలాల కిరణ్, రాజేంద్ర ప్రసాద్, టైగర్ రేఖ, భానుచందర్, అశ్పక్ అలి, ఈదులకంటి మహేష్, సుమ, నలిని, మోనిష్ మొదలగు వారు ప్రజాభి ప్రాయ సేకరణలో చురుకుగా పాల్గొనడం జరిగినది.