కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతూనే వున్నాయి.మంగళవారం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ లో చేరారు.
పార్టీ మారిన వారిలో గద్వాల నియోజక వర్గానికి చెందిన బీజేపీ, బీఆరెస్ కు చెందిన వారున్నారు.
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రామిరెడ్డి,రిటైర్డ్ ఎంఈఓ సత్యనారాయణ, ఎంపీటీసీలు శివారెడ్డి, ఈశ్వర్, మాజీ ఎంపీపీలు గోవింద్, నాయుడు,సర్పంచ్ సునీత, వార్డు సభ్యులు, కార్యకర్తలున్నారు.
వీరిని రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.