మార్షల్ ఆర్ట్స్ విజేతలను సన్మానించిన డా. శైలేందర్ రెడ్డి

 

జగిత్యాల, సెప్టెంబర్ 5: రాంచీలో గత నెలలో వాకో ఇండియా నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ప్రతిభ కనబరచి పథకాలను సాధించిన ముగ్గురు విద్యార్థులను బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డా. ఎడమల శైలేందర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. మంగళవారం స్థానిక వాకో ఇండియా కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో మార్షల్ ఆర్ట్స్ లో క్యాడేట్, జూనియర్ స్థాయిలలో పతకాలు సాధించిన సాయి సృజన్, హర్షిత్, వశిష్ట లను డా. శైలేందర్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డా. శైలేందర్ రెడ్డి మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ లోని వివిధ విభాగాల్లో జగిత్యాల విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం ఎంతో గర్వకారణమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీకి వెళ్లే మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తనవంతు సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ రామాంజనేయులు, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, బీఆర్ ఎస్ నాయకులు సిరిపురం మహేందర్, లయన్స్ క్లబ్ అద్యక్షులు శ్రీరాముల సుదర్శన్, ఫిజియోతెరఫీస్ట్ జహీర్, తోట హనుమంతు, గంగాధర్, శ్రీనివాస్, రవి, వెంకటేష్, సంతోష్ తోపాటు పలువురు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking