జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మే 01
జమ్మికుంట మండల పరిధిలోని పెద్దంపల్లి గ్రామంలో మే డే వేడుకలు అట్టహాసంగా జరుపుకోవడం జరిగింది. 2024 మే ఒకటో తారీకు కార్మికుల దినోత్సవం సందర్భంగా పెద్దంపల్లి హమాలి కార్మికులు అందరూ ఐకమత్యంగా ఒక కొత్త యూనియన్ను ఏర్పరచుకోవడం జరిగింది. హమాలీ కార్మికులు యూనియన్ గా ఏర్పడ్డాక మొదటిసారి పెద్దంపల్లి గ్రామంలో సిఐటియు జెండా ఎగురవేసి మేడే వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొత్త యూనియన్ ప్రెసిడెంట్ గా కాశిరెడ్డి స్వామి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా తిప్పారపు సురేష్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డె మమత ప్రసాద్, ఇల్లందుల రామరాజు ,మామిడి తిరుపతిరెడ్డి ,హమాలీ కార్మికులు రాజు, యుగేందర్, కిషోర్, శ్రీను, మొగిలి ,రాములు సుధాకర్, గోపాల్ ,మధు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.