గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ఇప్పటీకీ ప్రకటించలేదు ఈ సీటు కోసం ఎవరికివారు సీటు నాకే అని ప్రజల వద్దకి వెలుతున్నారు.వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు.దీనిలో భాగంగా గడ్డం గంగాధర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గంలోని ఉచిత విద్య కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇప్పుడు
గోషామహల్ నియోజకవర్గ స్థానికులకు శుభవార్త అని మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఇప్పుడు ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న విద్యార్థులకు మెగా జాబ్‌మేళాఅని వాట్సాప్‌గ్రూప్‌లలో పోస్టర్ విడుదల చేశారు.ఆ పోస్టర్‌లో అభ్యర్థుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు మరియు రిజిస్ట్రేషన్‌కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండని సూచించారు.ఈ మెగాజాబ్ మేళా సెప్టెంబర్ 15న నిర్వహించబడుతుందని ఈ రోజునుంచే తాను సూచించిన హెల్ప్‌లైన్ నంబర్లని క్యూఆర్ కోడ్‌ని వినియోగించుకోవాలని నిరుద్యోగ విద్యార్థులని కోరారు.ఈ కార్యక్రమాన్ని గడ్డం గంగాధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుందని అన్నారు.కార్యస్థలంహైదరాబాద్‌లోని రామకోటిలోని కింగ్ కోటి ప్రాంతంలోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ ప్యాలెస్‌లో మెగా జాబ్ మేళ కార్యక్రమం నిర్వహించబడుతుంది.ఈ కార్యక్రమంలో 80కి పైగా కంపెనీలు వస్తున్నాయని 8వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించిన ప్రతినిరుద్యోగి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
గ్రంధాలయ మాజీ చైర్మన్, గోషామహల్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మరియు గడ్డం గంగాధర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15, 2023, హైదరాబాద్‌లోని రామకోటిలోని కింగ్ కోటి ప్రాంతంలోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ ప్యాలెస్‌లో మెగా జాబ్ మేళ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
Next Post