ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ సెప్టెంబర్ 2:
సభ్యత్వ నమోదు ను వేగవంతం చేయాలని ఉప్పల్ నియోజకవర్గం బిజెపి సభ్యత్వ నమోదు ఇన్చార్జి గోపాల్ గౌడ్ బిజెపి నాయకులకు కార్యకర్తలకు సూచించారు. హబ్సిగూడ డివిజన్ పరిధిలో డివిజన్ అధ్యక్షులు హరీష్, డివిజన్ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ ల ఆధ్వర్యంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యశాలలో ముఖ్య అతిధిగా జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమ సభ్యులు ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ పోతగాని గోపాల్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు చేసి ఉప్పల్ నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చేతన బిజెపి సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు