చేపల ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్.
ఘనంగా స్వాగతం పలికిన మచ్చ శాఖ డైరెక్టర్ గడప దేవేందర్.
మెదక్ ఆగస్టు 26 ప్రజాబలం న్యూస్ :-
మెదక్ ఏప్డీవో ఆఫీస్ లో మత్స్యశాఖ సహకార సంఘం చైర్మన్ మెట్టు సాయికుమార్ సందర్శించిన సందర్భంగా జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్ ఘనంగా స్వాగతం పలికారు పూలే బొకేతో పాటు శాలువాతో ఘనంగా సత్కరించారు. వీధితోపాటు డైరెక్టర్ అంజయ్య కృష్ణ భాగ్య స్వామి శ్రీనివాస్ డిస్టిక్ ఏప్డీవో మల్లేశం ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేప పిల్లల అభివృద్ధి కేంద్రమైన మెదక్ లో ఉన్న వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకొని వాటి పునర వృద్ధి కి తోడ్పాటు చేయడానికి కృషి చేస్తానని అన్నారు. అలాగే జిల్లా మత్స్యశాఖ కార్యవర్గ సభ్యులకు భవనం కావాలని కోరడం జరిగిందని దానికి చైర్మన్ సానుకూలంగా స్పందించి వెంటనే నిర్మాణ పనులు చేపట్టగలరని అధికారులకు చెప్పడం జరిగిందన్నారు. మెదక్ లో ఉన్న చేప పిల్లల కేంద్రం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుట కోసం తగినన్ని నిధులు సమకూరుస్తానని చెప్పడం జరిగిందన్నారు అన్ని జిల్లాల కన్న మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లాలో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి చేప పిల్లల కేంద్రాన్ని త్వరలో ఉపయోగానికి తీసుకొస్తానని మాట ఇవ్వడం జరిగిందని తెలిపారు చేప పిల్లల పంపిణీలో ఎలాంటి ఔకతవకలు జరగకుండా మన ప్రభుత్వం చర్య తీసుకుంటుందని మంచి నాణ్యమైన చేప పిల్లలను చెరువులో ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే మహిళా సొసైటీ వివాలింగ్ ఫండ్ అలాగే మత్స్యకారుల ప్రమాదంలో చనిపోయిన వారికి రావాల్సినటువంటి నష్టపరియాన్ని తొందరలో పూర్తి చేసి వారికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు చెరువులను కబ్జాలకు గురికాకుండా చూసుకోవడం డైరెక్టర్ బాధ్యత అని తెలిపారు మత్స్యకారులు చెరువులు బాగుంటేనే ఊరు బాగుంటుందని మత్స్యకారుడు ఆర్థికంగా ఎదుగుదలకు తోడ్పడుతుందని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో దుర్గేష్, శ్రీనివాస్,దేవేందర్,
కృష్ణయ్య, పెంటయ్య,స్వామి,
బాగయ్య అంజయ్య నర్సింలు,మత్స్యశాఖ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.