మంత్రి అజయ్ కుమార్ పై వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ నిప్పుల

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 8 (ప్రజాబలం)ఖమ్మం జిల్లా బీఆర్ యస్ వర్గపోరు భగ్గుమన్నది వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ జిల్లామంత్రి పువ్వాడ అజయ్ పై వైరాలో జరిగిన సంక్షేమ పథకాలు అమలు కార్యక్రమ సభలో ఘాటు విమర్శలు చేశారు తన నియోజకవర్గంలో మంత్రి జోక్యం ఏమిటి అంటూ ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్ రాజు అయితే కేటీఆర్ యువరాజుగా మంత్రి పువ్వాడ అజయ్ సమంత రాజుల వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దళితబంధు విషయంలో కొంతమందికి దళిత బంధు వస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఆమేరకు వారి వద్ద నుంచి కొన్ని నిధులు వసూల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి మంత్రి తన నియోజకవర్గంలో వేలుపెట్టడంపై గరం గరం అయ్యారు మంత్రి అజయ్ ఉమ్మడి జిల్లాలో తనకు ఒక్కడినే గెలవాలనే దురుద్దేశం ఉన్నారని విమర్శలు గుప్పించారు వేదిక మీదనే మంత్రి అజయ్ డౌన్ డౌన్ అంటూ స్వయంగా ఎమ్మెల్యే నినదించడం అక్కడ ఉన్నవారిని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking