ప్రజాబలం వరంగల్ ప్రతినిధి ఏప్రిల్ 11:
రంజాన్ పండుగ సందర్భంగా వరంగల్ నగరంలో ముస్లిం సోదరులతో కలిసి గురువారం అటవీ ,పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గురువారం ఉదయం వరంగల్ జెమినీ థియేటర్ వద్ద ఉన్న ఈద్గా లో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసినరు. హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, సిరిసిల్ల రాజయ్య లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం. తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ అధ్యక్షతన కిలా వరంగల్ కోర్టు జంక్షన్ లో ఉన్న ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం రంజాన్ ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ముందుగా
ముస్లిం సోదరి సోదరులందరికీ హృదయపూర్వక రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఎన్నికల కోడ్ రావడం వల్ల ప్రభుత్వం తరఫున సదుపాయాలు ఏమి చేయలేకపోయామనీ అయిన ముస్లిం సోదరులు ప్రార్థనకు కావలసిన అన్ని ఏర్పాట్లు చక్కగా చేసుకుని ప్రభుత్వానికి సహకరించారని అన్నారు.
40 రోజులు ఎంతో నిష్టతో చిన్న నుండి పెద్ద వరకు అందరు ఉపవాసం చేయడం చాలా విశేషం అని మతాలకు, కులాలకు అతీతంగా రంజాన్ పండుగను జరుపుకోవడం జరుగుతుందనీ అన్నారు.
ఈ పండుగ సందర్భంగా ఒక ప్రత్యేక హోదాలో ఈద్గా కి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందనీ అన్నారు.
అల్లాను స్మరించుకునే అవకాశం నాకు రావడం చాలా సంతోషన్ని ఇచ్చిందని అన్నారు. రంజాన్ పండుగ మన బ్రతుకులలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాట్లు పేర్కొన్నారు ఆమెతో పాటు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
